ఇలా దేశాన్ని రాష్ట్రాలుగా విడగొట్టడం వేర్పాటువాదం కాదా? ఇది దేశ విచ్చిన్నతకు దారి తీయదా?

ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణా ప్రజలు చేస్తున్న ఉద్యమాన్ని “వేర్పాటువాదం’ అని ముద్ర వేస్తున్నారు కొందరు. ఇలా వేసేవారందరూ ఒకే ఉద్దేశ్యంతో ఈ పని చేయట్లేదు. కొంత మంది మిత్రులు నిజంగానే ఈ తేడాను అర్ధం చేసుకోలేకపోతున్నారు. మరి కొంత మంది అర్ధం చేసుకున్నా ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న వేర్పాటువాద (ఉదా: కాశ్మీర్, ఖలిస్తాన్) ఉద్యమాల కోవలో చూడగూడదు. దేశం నుండి విడిపోవాలనుకోవడం వేర్పాటువాదం అవుతుంది కానీ తమ ప్రాంతానికి స్వయం పాలనాధికారం కావాలని కోరడం వేర్పాటువాదం కాదు. తెలంగాణా ప్రజలు అభివృద్ధి, ఆత్మ గౌరవం ప్రాతిపదికలుగా తమకు స్వయంపాలన కోరుతున్నారు.

ఒకవేళ తెలంగాణా కోరడం వేర్పాటువాదం అయితే 1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి విడిపోవాలనుకున్న తెలుగు ప్రజల ఆకాంక్షను కూడా వేర్పాటువాదంగానే పరిగణించాల్సి ఉంటుంది.

అసలు భాషా జాతీయవాదాన్ని కొంచెం అతిగా సాగదీస్తేనే అది దేశ సమగ్రతకు ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది. తమిళులు స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో ప్రత్యేక దేశం కొరకు ఉద్యమించడం ఇటువంటి కోవలోకే వస్తుంది.

Source: http://hridayam.wordpress.com/2007/03/05/telangana-separatism/

ప్రకటనలు

%d bloggers like this: